నిబంధనలు పాటించని ఏజెన్సీలపై చర్యలు
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ షురూ
చటాన్‌పల్లి ఆర్‌ఓబీ స్థలం పరిశీలన షాద్‌నగర్: మున్సిపల్ పరిధిలోని చటాన్‌పల్లి రైల్వే గేటు వద్ద నిర్మించ తలపెట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జి స్థలాన్ని మంగళవారం అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా రైల్వే శాఖ గతి శక్తి కార్యాలయం అధికారి రాజారెడ్డి, రైల్వే విశ్రాంత డిప్యూటీ కలెక్టర్ శంకర్‌కుమార్, తహసీల్దార్ నాగయ్య, మున్సిపల్ కమిషనర్ సునీత, టీపీఓ పావని, ఆర్ అండ్ బీ డీఈ శ్రీలత, ఏఈ రాజశేఖర్ పరిశీలించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించిన భూ, ప్లాట్ల సేకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. స్ధలాలు కోల్పోయే వారి జాబితాను రూపొందించి పరిహారం అందించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆర్‌ఓబీ నిర్మించే స్థలాన్ని పరిశీలించి త్వరలో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు. స్థల సేకరణ, రోడ్డు విస్తరణ తదితర అంశాలను పరిశీలించారు.
సేంద్రియ ఎరువుల
తయారీపై అవగాహన మొయినాబాద్: వ్యర్థాలు, చెత్తాచెదారంతో సేంద్రియ ఎరువుల తయారీపై మున్సిపాలిటీలోని అజీజ్‌నగర్ డంపింగ్‌యార్డులో మంగళవారం మున్సిపల్ కమిషనర్లు, పారిశుద్ధ్య సిబ్బందికి అవగాహన కల్పించారు. వ్యర్థాలను కంపోస్ట్‌గా మార్చడం ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉండటంతో పాటు ఎరువులను సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని కంపోస్ట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ హేమలత, ఎన్‌ఐయూఎం రీసెర్చ్ అసోసియేట్ నసీమా తెలిపారు. తడి, పొడి చెత్తతో పాటు ఎలక్ట్రానిక్ పరికరాలు, న్యాప్కిన్స్ వంటి వేస్టేజీలను నాలుగు వేర్వేరు డబ్బాల్లో వేయాలని.. దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో మొయినాబాద్, ఇబ్రహీంపట్నం, గుమ్మడిదల, ఇస్నాపూర్, చేవెళ్ల, శంకర్‌పల్లి, ఆమనగల్లు, ఇంద్రేశం మున్సిపల్ కమిషనర్లు, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.
భారత్ గ్యాస్ ఏజెన్సీ స్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ సచిన్
కుల్కచర్ల: నిబంధనలు పాటించని ఏజెన్సీలపై చర్యలు తప్పవని భారత్ గ్యాస్ ఏజెన్సీ స్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ సచిన్ హెచ్చరించారు. మండల కేంద్రంలోని శ్రీగురుదత్త గ్యాస్ ఏజెన్సీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో మంగళవారం ఆయన విచారణ చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరిస్తే అవినీతికి ఆస్కారం ఉండదన్నారు. ప్రతీ సిలిండర్ ఖచ్చితంగా 30కిలోల బరువు ఉండాలని, సిలిండర్ తీసుకునే సమయంలో అనుమానం వస్తే వెంటనే బరువు చూసి కొనుగోలు చేయాలని సూచించారు. గ్యాస్ బరువులో తూకం తక్కువగా ఉంటుందని.. ఇంటికి డెలివరీ చేయడం లేదని.. ఏజెన్సీ కార్యాలయంలో పరుష పదజాలంతో సమాధానాలు ఇస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. వినియోగదారుల ఫిర్యాదులను, సూచనలు ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన చెప్పారు.
బొంరాస్‌పేట: రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీకి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి జెడ్పీ సీఈఓ సుధీర్, గెజిటెడ్ అధికారుల బృందం పరిశీలించింది. అనంతరం అల్లిఖాన్‌పల్లిలో ఏఈ సాయినాథ్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సోని ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించారు. ఈ అధికారుల బృందంలో హౌసింగ్ పీడీ ముక్రంబాబా, డీఈఈ చందర్, ఎంపీడీఓ జైపాల్‌రెడ్డి, ఎంఈఓ శంకర్, సాయినాథ్‌రెడ్డి, నాయకులు వెంకటయ్య ఉన్నారు.