బొంరాస్‌పేట: దుద్యాల మండల పరిధిలో శంషాబాద్–కోస్గి రేడియల్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులతో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ సమావేశం నిర్వహించారు. హకీంపేట రైతు వేదికలో పోలేపల్లి రైతులతో ఏర్పాటు చేసిన సమావేశానికి తాండూరు ఆర్డీఓ అనిత హాజరై వారి అభిప్రాయాలు సేకరించి, సమస్యలను, వివరాలు సేకరించారు. గ్రామంలో 53 ఎకరాల్లో 42 మంది రైతులు నిర్వాసితులుగా ఉన్నారని చెప్పారు. పొలాలతోపాటు ఇతర నిర్మాణాలు, బోర్లు, పైప్‌లైన్, చెట్లు, షెడ్లు వివరాలను రైతుల వారీగా సేకరించారు. నష్టపరిహారం కోసం ప్రభుత్వానికి విన్నవిస్తామన్నారు. ప్రతీ నిర్వాసితుడికి తగిన ఆర్థికసాయం అందుతుందన్నారు. సందేహాలుంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో తహసీల్దారు కిషన్‌నాయక్, డీటీ, పోలేపల్లి రైతులు పాల్గొన్నారు.
● తాండూరు ఆర్డీఓ అనిత
● శంషాబాద్–కోస్గి రేడియల్ రోడ్డులో భూములు కోల్పోతున్న రైతులతో ప్రజాభిప్రాయ సేకరణ


