ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేపట్టండి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేపట్టండి

Aug 12 2026 8:00 AM | Updated on Aug 12 2026 8:00 AM

అనంతగిరి: వానాకాలం సీజన్‌కు సంబంధించి ధాన్యం సేకరణకు వరి కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేసుకోవాలని అదనపు కలెక్టర్‌ వెంకటాచారి అధికారులకు సూచించారు. మంగళవారం ఆయన వానాకాలం వరి ధాన్యం సేకరణకు ముందస్తు కార్యాచరణ ప్రణాళికపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వానాకాలంలో దొడ్డురకం వరి ధాన్యం సేకరణ ఎక్కువగా ఉంటుందని అందుకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూనికలు, సంచులు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గోదాంలు ముందస్తుగా సిద్ధం చేసుకోవాలన్నారు. ఒక్కో మిల్లుకు 60 మంది హమాలీలు తగ్గకుండా చూసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో వ్యవసాయ అధికారి కవిత, డీసీఓ శ్రీనివాస్‌, అదనపు డీఆర్‌డీఓ నర్సింలు, డీసీఎంఎస్‌ రమణారెడ్డి, డీటీసీఎస్‌ విజయలక్ష్మి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ వెంకటాచారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement