‘ఏక్‌ పేడ్‌ మాకే నామ్‌’ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

‘ఏక్‌ పేడ్‌ మాకే నామ్‌’ ప్రారంభం

Aug 7 2026 6:34 AM | Updated on Aug 7 2026 6:34 AM

పోక్సో కేసులో న్యాయవాదికి జైలు

నవాబుపేట: ప్రతిఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించడం తమ బాధ్యతగా భావించాలని మండలంలోని మీనపల్లి కలాన్‌ సర్పంచ్‌ వెంకటమ్మ అన్నారు. గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆవరణలో గురువారం ‘ఏక్‌ పేడ్‌ మాకే నామ్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల వద్ద, పొలాల వద్ద, రహదారుల పక్కన కనీసం ఒక మొక్కను నాటి, దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సీహెచ్‌.వెంకటరత్నం, వార్డు సభ్యురాలు లక్ష్మమ్మ, యువకుడు రమేష్‌, ఉపాధ్యాయులు శ్రీనివాసరావు, గోవిందమ్మ, వెంకటయ్య, విజయ్‌, మాణిక్య ప్రభు, మల్లేష్‌, రవీందర్‌, శ్రీలత, గ్రామ కార్యదర్శి వరలక్ష్మి, అంగన్‌వాడీ కార్యకర్తలు అరుణ జ్యోతి, దేవమ్మతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు.

పంచాయతీ కార్యదర్శుల నిరసన

మంచాల: తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అవమానానికి గురిచేస్తున్న వారిపై తగిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం మండల పరిషత్‌ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తంచేశారు. జాపాల జీపీ కార్యదర్శి మురళీమోహన్‌చారి విధులకు ఆటంకం కలిగించడంతో పాటు అవమానపర్చిన వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. తక్షణమే అతనిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రోడ్డు ప్రమాదంలో

ఇంటర్‌ విద్యార్థి మృతి

బొల్లారం: తిరుమలగిరి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఇంటర్‌ విద్యార్థి మృతి చెందగా మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్‌ సుభాష్‌నగర్‌కు చెందిన నర్సింగరావు కుమారుడు తేజస్‌ (19) బొల్లారంలోని ఎల్‌ఆర్‌ఎంజీ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అల్వాల్‌కు చెందిన కన్నయ్య కుమార్‌ (18)తో కలిసి గురువారం ద్విచక్ర వాహనంపై కళాశాలకు వెళ్తుండగా లాల్‌బజార్‌ కల్లుకంపౌండ్‌ సమీపంలో మరో ద్విచక్ర వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో అదుపుతప్పి విద్యుత్‌ స్తంభాన్ని బలంగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో వెనుక కూర్చున్న తేజస్‌ అక్కడికక్కడే మృతి చెందగా, వాహనం నడుపుతున్న కన్నయ్య కుమార్‌కు రెండు చేతులు విరిగాయి.

చిక్కడపల్లి: పోక్సో కేసులో న్యాయవాది మల్లేష్‌కు మూడేళ్ల సాధారణ జైలు శిక్ష, రూ.6వేలు జరిమానా విధిస్తూ నాంపల్లి 12వ అదనపు సెషన్స్‌ కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. 2021లో చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బాలికను దూషిస్తూ.. సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతూ తరచుగా వేదిస్తున్నారని కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. నేరం రుజు వు కావడంతో బుధవారం మల్లేష్‌కు జైలు, జరిమానా విధించారని చిక్కడపల్లి ఇన్‌స్పెక్టర్‌ మధుబాబు గురువారం తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement