ఇక్రిశాట్ ప్రిన్సిపాల్ సైంటిస్టు
హరికిషన్ నందిని
దౌల్తాబాద్: రైతులు పంట మార్పిడి విధానాన్ని అవలబించాలని ఇక్రిశాట్ ప్రిన్సిపాల్ సైంటిస్టు హరికిషన్ నందిని సూచించారు. ఆరుతడి పంటలు పప్పు ధాన్యాల సాగు, ఆయిల్ పామ్ తోటలు పెంచాలన్నారు. బుధవారం మండలంలోని చల్లాపూర్ గ్రామంలో శాస్త్రవేత్తలు, నిపుణుల బృందంతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. సబ్సిడీపై విత్తనాలు, డ్రిప్ పరికరాలు అందజేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ తులసి, ఆయిల్ పాం ఫీల్డ్ ఆఫీసర్ మల్లికార్డున్ తదితరులు పాల్గొన్నారు.
తాండూరు టౌన్/తాండూరు రూరల్: పాలిషింగ్ యూనిట్ల వద్ద ఎండు గంజాయి విక్రయిస్తున్న ఓ బీహారీని ఎకై ్సజ్ పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 1.150 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా మద్య నిషేధ, ఆబ్కారీ అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం...బీహార్ రాష్ట్రం కటిహార్ జిల్లా బైరియా గ్రామానికి చెందిన మ్‌మద్ ముస్తకీమ్ అనే వ్యక్తి తాండూరు మండలం గోపాన్‌పల్లి సమీపంలోని పాలిషింగ్ యూనిట్ల వద్ద గంజాయి విక్రయిస్తున్నాడనే పక్కా సమాచారంతో తాండూరు ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ రాణి ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి గంజాయిని స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.
చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు
ఎంఆర్‌ఐ ప్రేమ్ కుమార్
తుర్కయంజాల్: వరుసగా వివాదాలకు కారణమైన అబ్దుల్లాపూర్‌మెట్ మండలం తుర్కయంజాల్ సర్వే నెంబర్ 338లోని భూమిని స్వాధీనం చేసుకున్నామని ఎంఆర్‌ఐ ప్రేమ్ కుమార్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. ఈ భూమి పూర్తిగా రెవెన్యూ విభాగం ఆధీనంలో ఉందని.. ఎవరైనా ప్రవేశించినా, స్థలాన్ని కొనుగోలు, విక్రయాలు చేసినా, అనుమతి లేని నిర్మాణాలు చేపట్టిన చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మున్సిపల్, పోలీస్ శాఖల అధికారులతో కలిసి పంచనామా నిర్వహించి స్వాధీనం చేసుకుని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.
శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం
కొత్తూరు: అంత్యక్రియలు నిర్వహించిన శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించిన ఘటన మండల పరిధిలోని ఇన్ముల్‌నర్వ గ్రామంలో బుధవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల వివరాల మేరకు.. గ్రామానికి చెందిన దివ్యాంగుడైన పాత్లావత్ నరేష్(27) జేపీదర్గాలో భిక్షాటన చేస్తూ జీవించేవాడు. గత నెల 15న దర్గా నుంచి ఇంటికి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు అతన్ని ఉస్మానియాకు తరలించారు. బాధితుడి అన్న వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. రెండు రోజుల తర్వాత పోలీసులు, ఆస్పత్రి వర్గాలకు సమాచారం ఇవ్వకుండానే కుటుంబ సభ్యులు నరేశ్‌ను ఇంటికి తీసుకురాగా, రెండు రోజుల క్రితం మృతిచెందాడు. దీంతో అతని అంత్యక్రియలు పూర్తి చేశారు. నరేశ్ మృతిపై అనుమానాలు వ్యక్తంకావడంతో పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో మంగళవారం ఉస్మానియా నుంచి వచ్చిన నలుగురు వైద్యుల బృందం పూడ్చిన శవాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించింది.
ఫాక్స్‌కాన్ ఉద్యోగుల గదుల్లో చోరీ
ఇబ్రహీంపట్నం రూరల్: ఫాక్స్‌కాన్ కంపెనీలో ఉద్యోగాలు చేస్తున్న వియత్నాం దేశానికి చెందిన ప్రతినిధుల గదుల్లో దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిపై ఆదిభట్ల పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ రమేశ్ తెలిపిన ప్రకారం. రోచీష్మతి అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న వియత్నాం దేశానికి చెందిన ఫాక్స్‌కాన్ ఉద్యోగుల గదుల్లో అదే డార్మిటరీ సూపర్‌వైజర్‌గా పని చేస్తున్న మారినేని చిన్న వెంకటరావు నగదు దొంగిలిస్తున్నాడు. ఓ ఉద్యోగి పెట్టిన స్పై కెమెరాలో చోరీకి పాల్పడిన వీడియో రికార్డయింది. రూ.7 వేలు నగదు దొంగిలిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నిందితుడిని పోలీసులకు అప్పగించారు. అపార్ట్‌మెంట్‌లోని ఆరు ఇళ్లలో రూ.లక్ష వరకు నగదు అపహరించాడని బాధితులు ఫిర్యాదు చేశారని.. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


