సైబర్‌ నేరాలపై అప్రమత్తత అవసరం | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ నేరాలపై అప్రమత్తత అవసరం

Aug 6 2026 8:08 AM | Updated on Aug 6 2026 8:08 AM

శంకర్‌పల్లి: సైబర్‌ నేరాలపై విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని మోకిల సీఐ శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బుధవారం ‘సైబర్‌ జాగ్రుక్తా దివస్‌’లో భాగంగా ప్రాచీన్‌ గ్లోబల్‌ స్కూల్‌లో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు పెద్ద ఎత్తున మొబైల్‌ ఫోన్లను వినియోగించడంతో సైబర్‌ నేరాలు జరగుతున్నాయన్నారు. అపరిచితులు మాయమాటలు చెప్పి బ్యాంకు ఖాతాల నుంచి కోట్లు కొల్లగొడుతున్నట్లు స్పష్టం చేశారు. ఫోన్లకు వచ్చే ఓటీపీ, కాల్స్‌కి స్పందించొద్దని, ఇంటి పరిసరాల్లో అనుమానితులు సంచరిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. సైబర్‌ నేరాలకు దూరంగా ఉండాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో మోకిల ఎస్‌ఐ సురేశ్‌ గౌడ్‌, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.

సీఐ శ్రీనివాస్‌రెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement