తాండూరు: స్థానిక ఎమ్మెల్యే బి.మనోహర్‌రెడ్డి బర్త్ డే వేడుకలను బుధవారం నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించాయి. ప్రజాప్రతినిధులు, నాయకులు సంబరాల్లో పాల్గొని కేక్‌లు కట్ చేశారు. విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. చైర్‌పర్సన్ పట్లోళ్ల నీరజాబాల్‌రెడ్డి రక్తదానం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు నాగరాజు, ఎమ్మెల్యే తనయులు అవినాష్‌రెడ్డి, శివారెడ్డి, నాయకులు పట్లోళ్ల నర్సింహులు, బాల్‌రెడ్డి, అబ్దుల్ రజాక్, పురుషోత్తంరావు, సంతోష్, ప్రభాకర్‌గౌడ్, హబీబ్‌లాల, కౌన్సిలర్లు వెంకట్, స్వరూప, వేణుగోపాల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా, అమెరికా పర్యటనలో ఉన్న ఎమ్మెల్యే ప్రవాసభారతీయులు, మంత్రి జూపల్లి సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకొన్నారు.
గౌతాపూర్ చౌరస్తాలో..
తాండూరు రూరల్: కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో గౌతపూర్ చౌరస్తా వద్ద కేక్‌కట్ చేశారు. సీనియర్ నాయకులు మల్కాపూర్ జనార్దన్‌రెడ్డి, నాగప్ప పాల్గొన్నారు.
వేర్వేరుగా వేడుకలు
బషీరాబాద్: కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి, అజయ్ ప్రసాద్ వర్గీయులు ఒకవర్గంగా మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాధవ్‌రెడ్డి, సొసైటీ చైర్మన్ వెంకట్‌రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్‌రెడ్డి, రోహిత్ మహారాజ్, మాణిక్‌రెడ్డి, రాము నాయక్, కలాల్ నర్సింలు, పవన్ ఠాకూర్, కాశప్ప తదితరులు మరోవర్గంగా ఎమ్మెల్యే పుట్టిన రోజు వేడుకలు నిర్వహించారు.


