కలిసిసాగితేనే అభివృద్ధి | - | Sakshi
Sakshi News home page

కలిసిసాగితేనే అభివృద్ధి

Aug 6 2026 8:08 AM | Updated on Aug 6 2026 8:08 AM

పరిగి: అధికారం ఉన్నా లేకపోయినా ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషిచేస్తానని పీఏసీఎస్‌ మాజీ చైర్మన్‌ శివన్నోళ్ల భాస్కర్‌ అన్నారు. ఆషాఢ బోనాలను పురస్కరించుకుని పట్టణంలోని నాలుగో వార్డు సయ్యద్‌మల్కాపూర్‌ పోచమ్మ ఆలయం చుట్టూ తన సొంత డబ్బులతో కాంక్రీట్‌ చిప్స్‌ పోయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వార్డులోని సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని తెలిపారు. ప్రజలకు ఏ అవసరం వచ్చినా అండగా ఉంటానని స్పష్టంచేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని పరిసరాలతో పాటు ఇళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని, బురద, నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని సూచించారు. వార్డును అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తానన్నారు. కాలనీ అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో భాగంగా తన సతీమణి, కౌన్సిలర్‌ చంద్రకళ వార్డు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని స్పష్టంచేశారు. దశలవారీగా సీసీ రోడ్డు, అండర్‌ డ్రైనేజీలు నిర్మిస్తామని చెప్పారు. ప్రజలందరి సహకారంతోనే కాలనీ పురోగతి సాధ్యమని తెలిపారు. ఈవిషయంలో సమష్టిగా ముందుకు సాగాలని కోరారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా

పీఏసీఎస్‌ మాజీ వైస్‌ చైర్మన్‌

శివన్నోళ్ల భాస్కర్‌

పోచమ్మ ఆలయం చుట్టూ

కాంక్రీట్‌ చిప్స్‌ డంపింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement