విద్యతోనే ఉన్నత శిఖరాలు | - | Sakshi
Sakshi News home page

విద్యతోనే ఉన్నత శిఖరాలు

Aug 6 2026 8:08 AM | Updated on Aug 6 2026 8:08 AM

విద్యార్థులంతా కష్టపడి చదవాలి

పల్లవి డీఈడీ కాలేజీ కరస్పాండెంట్‌ కొప్పుల అనిల్‌రెడ్డి

పరిగి: తల్లిదండ్రుల కలలను సాకారం చేయాలని పల్లవి డీఈడీ కళాశాల కరస్పాండెంట్‌ కొప్పుల అనిల్‌రెడ్డి విద్యార్థులకు సూచించారు. బుధవారం పట్టణ కేంద్రంలోని కాలేజీలో ద్వితీయ సంవత్సర విద్యార్థులకు వీడ్కోలు సమావేశం, బోనాల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని సూచించారు. మంచి ఉద్యోగాలను సాధించి తల్లిదండ్రులకు, కళాశాలకు పేరుప్రతిష్టలు తీసుకురావాలన్నారు. విద్యతో ఏదైనా సాధ్యమనే విషయాన్ని గుర్తించి, కష్టపడి చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్‌, అధ్యాపక బృందం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement