వెలుగులో రూ.12 లక్షల దోపిడీ! | - | Sakshi
Sakshi News home page

వెలుగులో రూ.12 లక్షల దోపిడీ!

Aug 5 2026 8:45 AM | Updated on Aug 5 2026 8:45 AM

బషీరాబాద్‌: పేద మహిళల ఆర్థిక అభివృద్ధికి అండగా నిలవాల్సిన ‘వెలుగు’ వ్యవస్థలోనే భారీ అక్రమాలు బయటపడ్డాయి. స్వయం సహాయక సంఘాల మహిళలు కష్టపడి చెల్లించిన సీ్త్ర నిధి రుణ వాయిదాలను బ్యాంకుల్లో జమ చేయకుండా సిబ్బంది దుర్వినియోగం చేశారు. ఎక్మాయి గ్రామంలోని 20 మహిళా సంఘాల సభ్యుల నుంచి వసూలు చేసిన సుమారు రూ.12 లక్షల మేర నిధులు గల్లంతైనట్లు ఆడిటింగ్‌లో తేలడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. మహిళల సొమ్మును స్వాహా చేసిన ఇద్దరు వీఏఓలపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ వ్యవహారంలో పర్యవేక్షణ లోపాలపై ఉన్నతాధికారులు దృష్టిసారించినట్లు సమాచారం.

2020లో లోన్‌..

2020లో సీ్త్రనిధి పథకం కింద ఏక్మాయికి చెందిన సుమారు 20 స్వయం సహాయక సంఘాల సభ్యులు రుణాలు పొందారు. అనంతరం గ్రామ స్థాయిలో పనిచేస్తున్న వీఏఓలకు ప్రతినెలా డబ్బులు చెల్లిస్తూ వచ్చారు. కానీ, ఈ మొత్తం సంబంధిత బ్యాంకు ఖాతాలకు చేరలేదు. ప్రాథమిక విచారణలో మహిళా సంఘాల సభ్యుల నుంచి వీఏఓ స్వరూప రూ.4,05,761, మరో వీఏఓ వాణిశ్రీ రూ.3,05,498 వసూలు చేసినట్లు రికార్డులు వెల్లడించాయి. ఈ మొత్తాన్ని బ్యాంకుల్లో జమ చేయలేదని ఎంకై ్వరీలో తేలింది. అంతేకాకుండా మరో రూ.4 లక్షలకు పైగా లావాదేవీలపై కూడా స్పష్టత లేకపోవడంతో పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. తాము చెల్లించిన మొత్తాన్ని కూడా రుణ బకాయిలుగానే చూపిస్తున్నారని పలువురు సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఆడిటింగ్‌లో గుట్టు రట్టు

జూలై 3న నిర్వహించిన ప్రత్యేక ఆడిట్‌లో అధికారులు సీ్త్ర నిధి రుణాల లావాదేవీలను పరిశీలించారు. రుణాలు తీసుకున్న మహిళలు క్రమం తప్పకుండా చెల్లింపులు చేస్తున్నప్పటికీ బ్యాంకు రికార్డుల్లో బకాయిలు కొనసాగుతుండటంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. మహిళా సంఘాల సభ్యుల వాంగ్మూలాలు, రశీదులు, బ్యాంకు లావాదేవీలను పరిశీలించగా వసూలు చేసిన నగదు బ్యాంకుల్లో జమ కాలేదని తేలింది. దీంతో విషయం జిల్లా అధికారుల దృష్టికి చేరింది. రంగంలోకి దిగిన సీ్త్ర నిధి ప్రత్యేక అధికారులు గ్రామంలో విచారణ చేపట్టారు. మహిళల నుంచి వివరాలు సేకరించి, చెల్లింపుల రికార్డులను పరిశీలించారు. వసూలైన డబ్బు లు బ్యాంకు ఖాతాలకు చేరకపోవడం, రఽశీదులు, ఖాతాల మధ్య వ్యత్యాసాలు ఉండటంతో అక్రమా లు జరిగినట్లు నిర్ధారించారు. అయితే తేడా వచ్చిన డబ్బులు తాము చెల్లిస్తామని ఇద్దరు వీఏఓలు ఆడిటింగ్‌ అధికారులకు రాతపూర్వకంగా హామీ ఇచ్చారు. దీనిపై జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఓ) అధికారులు చర్యలకు సిద్ధమయ్యారు.

ఇద్దరిపై వేటు

విచారణ నివేదిక ఆధారంగా డీఆర్‌డీఓ శ్రీనివాస్‌ చర్యలు తీసుకున్నారు. వీఏఓలు స్వరూప, వాణిశ్రీని విధుల నుంచి తొలగిస్తూ రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెన్షన్‌ విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే తాము ఏ తప్పు చేయలేదని, ఎక్కడో జరిగిన పొరపాటు తమపై పడిందని స్వరూప, వాణిశ్రీ తెలిపారు.

సీ్త్రనిధి రుణాల వసూళ్లలో భారీ అక్రమాలు

మహిళల నుంచి డబ్బులు తీసుకుని బ్యాంకుల్లో జమ చేయని సిబ్బంది

ఆడిటింగ్‌లో బయటపడిన అవకతవకలు

ఇద్దరు వీఏఓలపై సస్పెన్షన్‌ వేటు

ఏపీఎం, సీసీకి మెమోలు

ఈ కేసులో తనకు సంబంధం లేనట్లుగా వ్యవహరించిన బషీరాబాద్‌ ఏపీఎం పద్మారావు, ప్రస్తుతం ఎక్మాయిలో విధులు నిర్వహిస్తున్న సీసీ కవితకు సైతం డీఆర్‌డీఓ మెమోలు జారీ చేసినట్లు సమాచారం. రుణాల రికవరీలో అవకతవకలు తెలిసినా, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లకుండా, వాస్తవాలను దాచిపెట్టినట్లు వీరిపై ఆరోపణలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement