డీఎంహెచ్‌ఓ సుధాకర్ లాల్
బంట్వారం: సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్‌ఓ సుధాకర్ లాల్ సూచించారు. మంగళవారం బంట్వారం పీహెచ్‌సీని సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అవుట్ పేషెంట్ల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. మందుల స్టాక్‌పై ఆరా తీశారు. సమస్యలు ఏమైనా ఉంటే చెప్పాలన్నారు. బాధ్యతగా పని చేసి వైద్య ఆరోగ్య శాఖ లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ మజీద్ ఖాన్, సీహెచ్‌ఓ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


