జేబు దొంగలకు రిమాండ్‌ | - | Sakshi
Sakshi News home page

జేబు దొంగలకు రిమాండ్‌

Aug 5 2026 8:45 AM | Updated on Aug 5 2026 8:45 AM

మొయినాబాద్‌: ఇటీవల ఓ కార్యక్రమంలో పిక్‌పాకెటింగ్‌కు పాల్పడిన ఇద్దరు జేబు దొంగలను మొయినాబాద్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 2న మున్సిపాలిటీలోని జేపీఎల్‌ కన్వెన్షన్‌లో పట్నం రుక్కమ్మ దశదిన కర్మ కార్యక్రమం జరిగింది. దీనికి చాలా మంది ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున ప్రజలు రావడంతో జేబుదొంగలు తమ చేతివాటం ప్రదర్శించారు. ఆరు మంది జేబుల్లో నుంచి నగదును దొంగించారు. వారంతా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వేర్వేరుగా కేసులు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. లంగర్‌హౌస్‌కు చెందిన మహ్మద్‌ షకీల్‌ అలియాస్‌ లంగ్డా అలియాస్‌ మోటా, పాతబస్తీకి చెందిన దేవరకొండ దుర్గారావు అలియాస్‌ శ్రీనులను సోమవారం అరెస్టు చేశారు. ఇద్దరిని మంగళవారం రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు శ్రీరామ్‌ గోపి పరారీలో ఉన్నాడు. నిందితులపై నగరంలోని పలు పోలీస్‌స్టేషన్లలో దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌ కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement