తాండూరు: ప్రైవేటు విద్యా సంస్థల్లో బట్టి చదువులకు స్వస్తి పలికి మానసిన వ్యక్తిత్వ వికాస విలువలతో కూడిన విద్యా భోధనను విద్యార్థులకు అందించాలని బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్ అన్నారు. మంగళవారం ఆయన ఎన్‌ఎస్మీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ తాండూరు అధ్యక్షుడు మోహన్‌కృష్ణగౌడ్, గౌరవ అధ్యక్షులు కీర్తి శర్మ, ఉపాధ్యక్షుడు అబ్దుల్ వహీద్, కార్యదర్శి వెంకటేశం, సంయుక్త కార్యదర్శి సునీత, కోశాధికారి రమేశ్‌గౌడ్, సలహాదారు సోహెల్‌ఉమ్రిలను సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులకు పాఠశాల బోధనకే పరిమితం చేయకుండా నైతిక విలువలు, క్రమశిక్షణ, కుటుంబ బాంధవ్యాల ప్రాముఖ్యతను వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు భానుప్రసాద్, మహేశ్, శేఖర్, సాయి, మనోహర్, తదితరులు పాల్గొన్నారు.
బీసీ కమిషన్ రాష్ట్ర మాజీ సభ్యుడు
శుభప్రద్‌పటేల్


