కొడంగల్: మండల వ్యాప్తంగా సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలో ఎడ్యుకేషన్ హబ్‌లో నిర్మాణంలో ఉన్న డీగ్రీ కళాశాలలోకి భారీగా వరద చేరడంతో పనులకు అంతరాయం ఏర్పడింది.
ధారూరులో 32.5 మి.మీల వర్షపాతం
ధారూరు: మండలంలో సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు 32.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని తహసీల్దార్ సాజిదాబేగం తెలిపారు. జిల్లాలోని కొడంగల్‌లో అత్యధికంగా 108.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యల్పంగా మర్పల్లిలో 1.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎబ్బనూర్ చెరువు పూర్తిగా నిండిపోగా కోట్‌పల్లి ప్రాజెక్టులో 22 అడుగుల వరకు నీరు చేరింది. మరో రెండు అడుగుల నీరు చేరితే ప్రాజెక్టు పూర్తిగా నిండిపోతుంది.
పొంగిపొర్గిన వాగులు, వంకలు


