అరుణాచలం ఆర్టీసీ సర్వీసు హర్షణీయం | - | Sakshi
Sakshi News home page

అరుణాచలం ఆర్టీసీ సర్వీసు హర్షణీయం

Aug 5 2026 8:45 AM | Updated on Aug 5 2026 8:45 AM

తాండూరు టౌన్‌: తాండూరు డిపో నుంచి తమిళనాడులోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలంకు బస్సు నడపడం అభినందనీయమని పట్టణ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పట్లోళ్ల నీరజ అన్నారు. మంగళవారం ఆమె తొలి సర్వీస్‌ను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసి బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించిందన్నారు. భక్తుల కోసం తాండూరు నుంచి అరుణాచలంకు బస్సు సర్వీసు నడపడం హర్షణీయమన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం డిపో మేనేజర్‌ ప్రవీ ణ్‌కుమార్‌ మాట్లాడుతూ.. అరుణాచలం ఆధ్యాత్మిక టూర్‌ పేరుతో భక్తుల కోసం ఈ సౌకర్యాన్ని కల్పించామన్నారు. భక్తులకు కాణిపాకంలోని వరసిద్ధి వినాయక ఆలయం, వెల్లూర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌తో పాటు అరుణాచలేశ్వర స్వామి వారి దర్శనం కల్పిస్తామన్నారు. ఫుల్‌ టికెట్‌ రూ.3,600, హాఫ్‌ టికెట్‌ రూ.2వేలు ఉంటుందన్నారు. ఇందుకు భక్తులు ముందస్తుగానే టికెట్లు బుక్‌ చేసుకోవాలని కోరారు. వివరాలకు 9948947422, 8309348157 నంబర్లలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పట్లోళ్ల బాల్‌రెడ్డి, ట్రాఫిక్‌ ఇన్‌చార్జి వెంకటేశం, ఆర్టీసి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

తాండూరు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ నీరజ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement