తాండూరు: ప్రభుత్వ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని తాండూరు బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం వారు మున్సిపల్ కమిషనర్ రాకేశ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మున్సిపల్ పరిధి సర్వే నంబర్ 135లోని ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారన్నారు. ప్రభుత్వ భూములు కాపాడాల్సిన టౌన్ ప్లానింగ్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికార పార్టీ అండదండలతోనే అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయని వాపోయారు. ఇప్పటికే సర్వేనెంబర్ 111 వివాదాస్పద భూమిలో పూర్తి స్థాయిలో ఆక్రమించి నిర్మాణాలు పూర్తి చేశారని తాజాగా సర్వేనెంబర్ 135లోను నిర్మాణాలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు షేక్ ఇర్షద్, యోగానంద్, పార్టీ నాయకుడు సంతోష్‌గౌడ్ ఉన్నారు.
చర్యలు తీసుకోవాలని
మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు


