కక్షపూరిత రాజకీయాలు సరికాదు | - | Sakshi
Sakshi News home page

కక్షపూరిత రాజకీయాలు సరికాదు

Aug 5 2026 8:45 AM | Updated on Aug 5 2026 8:45 AM

ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు

భద్రత పునరుద్ధరించాలి

బీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి

విజయ్‌ ఆర్యక్షత్రియ

పరిగి: రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేయడం సరికాదని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయ్‌ ఆర్యక్షత్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు భద్రత కుందింపునకు నిరసనగా మంగళవారం బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌కు భద్రత కుదింపు రాజ్యాంగ విరుద్ధమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కక్షపూరితంగానే ఈ చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. నక్సల్స్‌, టెర్రరిస్టుల నుంచి ప్రమాదం ఉన్నందునే గత ప్రభుత్వాలు బుల్లెట్‌ ఫ్రూప్‌ వాహనం, భద్రతా సిబ్బందిని కల్పించాయని సర్కార్‌కు గుర్తుచేశారు. వెంటనే భద్రత పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, సురేందర్‌, పట్టణ అధ్యక్షుడు అంజయ్య, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ ముకుందఅశోక్‌కుమార్‌, జాక్‌ రవి, కృష్ణ, రవికుమార్‌, ఆంజనేయులు, ఆనంద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement