అనంతగిరి: నేరాల నియంత్రణ, కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఏఎస్పీ రాజేష్ మీనా అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు, పర్యవేక్షణ, విస్తరణ చర్యలపై సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ పోలీస్ స్టేషన్ల వారీగా సీసీ కెమెరాలను ఆయా పీఎస్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నేరాల నియంత్రణ, కేసుల ఛేదన, ప్రజల భద్రతలో సీసీ కెమెరాలు కీలకపాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ప్రతి పీఎస్ పరిధిలో నిఘా నేత్రాల సంఖ్యను మరింత పెంచేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించాలన్నారు. కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ శ్రీనివాస్, డీసీఆర్‌బీ డీఎస్పీ జానయ్య, తాండూరు డీఎస్పీ యాదయ్య, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి
జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ స్నేహ మెహ్ర ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. బాధితుల సమస్యల పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని ఆమె తెలిపారు.
ఏఎస్పీ రాజేష్ మీనా


