హక్కుల సాధనకు పోరాటం | - | Sakshi
Sakshi News home page

హక్కుల సాధనకు పోరాటం

Aug 4 2026 9:54 AM | Updated on Aug 4 2026 9:54 AM

బంట్వారం: విద్య, ఉద్యోగ అవకాశాల్లో సరైన న్యాయం జరగాలంటే మాదిగలంతా సంఘటితం కావాల్సిందేనని ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కే మల్లికార్జున్‌ మాదిగ అన్నారు. సోమవారం బంట్వారంలో మండల కమిటీని నియమించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. హక్కుల సాధన కోసం మాదిగ జాతి నడుం బిగించి పోరాటానికి సిద్ధం కావాలన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా బాధితులకు ఎమ్మార్పీఎస్‌ అండగా నిలబడి ప్రశ్నిస్తుందన్నారు. అనంతరం మండల కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ప్రవీణ్‌కుమార్‌(తొర్మామిమిడి), అధికార ప్రతినిధిగా ఎల్లయ్య, ఉపాధ్యక్షుడిగా ఎం.ప్రేమ్‌కుమార్‌, ప్రధాన కార్యదర్శిగా బి.కుమార్‌, కార్యదర్శిగా శ్రావణ్‌కుమార్‌, కోశాధికారిగా సాయికుమార్‌, సలహదారుడిగా డి.సుధాకర్‌, ప్రచార కార్యదర్శిగా ఆర్‌.ప్రేమ్‌కుమార్‌, కార్యవర్గ సభ్యులుగా శ్యాంసన్‌, రాజు ,శ్రీకాంత్‌ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి భరత్‌కుమార్‌, ప్రతినిధులు గోపాల్‌, శ్రీనివాస్‌, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

మాదిగలంతా సంఘటితం కావాలి

ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement