ఎక్కువ సామర్థ్యం ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చండి | - | Sakshi
Sakshi News home page

ఎక్కువ సామర్థ్యం ట్రాన్స్‌ఫార్మర్లు అమర్చండి

Aug 4 2026 9:48 AM | Updated on Aug 4 2026 9:48 AM

దుద్యాల్‌: ఓవర్‌ లోడ్‌ కారణంగా మండలంలోని దుద్యాల్‌, ఈర్లపలి తదితర గ్రామాల్లో వ్యవసాయ బోరు మోటార్లు కాలిపోతున్నాయని, ఎక్కవ సామర్థ్యం కలిగిన ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేయాలని యూత్‌ కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మేరుగు శ్రీకాంత్‌, ఎస్టీ సెల్‌ మండల అధ్యక్షుడు రవి నాయక్‌ కోరారు. సోమవారం కొడంగల్‌లో కడా ప్రత్యేక అధికారిని కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. దుద్యాల్‌ చెరువ సమీపంలో దుద్యాల్‌, అల్లిఖాన్‌పల్లి గ్రామాల రైతుల కోసం ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేశారని, వ్యవసాయ కనెక్షన్లు ఎక్కువగా ఉండటంతో తరచూ ట్రాన్స్‌ఫార్మర్‌, బోరు మోటార్లు కాలిపోతున్నట్లు తెలిపారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకొని వెంటనే ఎక్కువ సామర్థ్యం ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయాలని వారు కోరారు. వినతి పత్రం అందించిన వారిలో యువజన కాంగ్రెస్‌ నాయకులు మల్లికార్జున్‌, వడిత్య కృష్ణ తదితరులు ఉన్నారు.

యూత్‌ కాంగ్రెస్‌ మండల నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement