హుడాకాంప్లెక్స్: పుట్టిన ప్రతి బిడ్డకు ముర్రుపాలు పట్టించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ స్వర్ణకుమారి అన్నారు. తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని సోమవారం సరూర్‌నగర్‌లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గర్భిణి కాన్పు జరిగిన వెంటనే బిడ్డకు ముర్రుపాలు ఇవ్వాలని సూచించారు. ఈ పాలలో ఇమ్యూనిటీ ఇచ్చే ఇమ్యునోగ్లోబిన్ ఉంటుందని, ఇది బిడ్డకు సహజ యాంటీ బయోటిక్‌గా పనిచేస్తుందని తెలిపారు. ఇందులో బిడ్డకు సరిపోయే ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయన్నారు. పుట్టిన ప్రతి బిడ్డకు ఆరు నెలల వరకు ఎలాంటి ఆహార పదార్థాలు తినిపించొద్దని, కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. తల్లిపాలు ఇవ్వడం ద్వారా తల్లి ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ డాక్టర్ సత్యవతి, డీఐఓ డాక్టర్ షీబా, ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారి డాక్టర్ అర్చన, సుష్మిత, మాస్‌మీడియా అధికారులు మంజుల, శ్రీనివాసులు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు శ్రీనివాసులు, పరాంకుశం, ఆరోగ్య విస్తరణ అధికారులు పోల శ్రీధర్, కె.శ్రీనివాసులు, పీహెచ్‌ఎన్ మల్లీశ్వరి, సూపర్‌వైజర్లు అజయ్, ఉమ, ఇందిర, నర్సింగ్ విద్యార్థులు పాల్గొన్నారు.


