ధారూరు: మండలంలోని కేరెళ్లిలో ఆదివారం ఉచిత కంటివైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు కేరెళ్లి సత్యసాయి సార్వజనిక కేంద్ర నిర్వాహకులు ఎం.ప్రేమ్‌కుమార్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు శిబిరం కొనసాగుతుందని తెలిపారు. ఈఅవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
రైతుల ఇబ్బందులు
తొలగించాలి
అనంతగిరి: ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్‌లో రైతుల ఇబ్బందులు తొలగించాలని బీజేపీ పరిగి అసెంబ్లీ ఇన్‌చార్జి మారుతి కిరణ్ బూనేటి కోరారు. శనివారం జిల్లా ఆర్‌టీఓకు వినతిపత్రం అందజేశారు. రైతులకు నిబంధనలు తెలియజేయకుండా ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే విధమైన విధానం అమలు చేసి, అర్హులైన రైతుల ట్రాక్టర్‌లకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని పేర్కొన్నారు.
దుకాణంలోకి నాగుపాము
తాండూరు: పట్టణంలోని ఓ షాపులోకి శనివారం నాగుపాము ప్రవేశించింది. మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ దాన్ని పట్టుకొని బయట వదిలేశారు. వివరాలిలా ఉన్నాయి. తాండూరు రైల్వే ఫ్లయ్ ఓవర్ బ్రిడ్జ్ సమీపంలోని ఓ కిరాణంలోకి నాగుపాము వచ్చింది. కుటుంబ సభ్యులు భయంతో బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రజాక్ ఆ ఇంటికి వెళ్లి నాగుపామును పట్టుకొని బయట వదిలేశారు.
శంకర్‌పల్లి: రైలు కింద పడి ఓ గుర్తు తెలియని వృద్ధురాలు(60) మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామ సమీపంలోని రైలు పట్టాలపై ఓ గుర్తు తెలియని మృతదేహం పడి ఉంది. గమనించిన లైన్‌మెన్ వెంటనే వికారాబాద్ రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు మృతదేహన్ని పరిశీలించి, వికారాబాద్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వృద్ధురాలు కదులుతున్న రైలులో నుంచి పడి మృతి చెందినట్లుగా రైల్వే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
మీర్‌పేట: ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన బాలిక అదృశ్యమైన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌లో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బడంగ్‌పేటకు చెందిన ఎర్రమల్ల భీమరాజు కుమార్తె శాలిని(17) ఇంటర్మీడియట్ చదువుతోంది. గత నెల 20వ తేదీన శాలిని ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆచూకీ కోసం బంధువులు, తెలిసిన వారి వద్ద వెతికినా ప్రయోజనం లేకపోవడంతో శనివారం తండ్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


