ధర్నాకు తరలిన తపస్‌ నేతలు | - | Sakshi
Sakshi News home page

ధర్నాకు తరలిన తపస్‌ నేతలు

Aug 2 2026 7:20 AM | Updated on Aug 2 2026 7:20 AM

కుల్కచర్ల: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తపస్‌ నిర్విరామంగా కృషిచేస్తోందని ఆ సంఘం మండల అధ్యక్షుడు స్వయంప్రకాశ్‌ అన్నారు. చలో ఇందిరాపార్క్‌ మహాధర్నా కార్యక్రమానికి శనివారం కుల్కచర్ల నుంచి భారీగా తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత పెన్షన్‌ విధానాన్ని అమలుచేయాలని, 2008 డీఎస్సీ ఉపాధ్యాయులను రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. పీఆర్సీ సాధన, డీఏ బకాయిల చెల్లింపుపై ప్రభుత్వం స్పందించే వరకూ తమ పోరాటం సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మహేంద్ర బహదూర్‌, రవికుమార్‌, బుచ్చిలింగం, వెంకటయ్య, శ్రీనివాస్‌గౌడ్‌, శ్రీను, కృష్ణయ్య, గాంగ్యనాయక్‌ తదితరులు పాల్లొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement