పొలాలకు దారి చూపండి | - | Sakshi
Sakshi News home page

పొలాలకు దారి చూపండి

Aug 2 2026 7:20 AM | Updated on Aug 2 2026 7:20 AM

తహసీల్దార్‌కు మంబాపూర్‌ రైతుల వినతి

తాండూరు రూరల్‌: తమ పొలాలకు వేళ్లేందుకు దారి చూపాలని పెద్దేముల్‌ మండలం మంబాపూర్‌ గ్రామ రైతులు కోరారు. ఈ మేరకు శనివారం తహసీల్దార్‌ వెంకట్‌ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గ్రామ శివారులోని 115 నుంచి 117 సర్వే నంబర్లకు సంబంధించిన సుమారు ఇరవై మంది రైతులు పొలాలకు వెళ్లేందుకు సరైన దారి లేక నిత్యం అవస్థలు పడుతున్నారన్నారు. గ్రామానికి చెందిన ఒకరిద్దరు రైతులు పానాదిని ఆక్రమించడంతోనే ఈ దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయమై బాధితులమంతా కలిసి హైకోర్టును ఆశ్రయించామని వివరించారు. పానాదిని క్లియర్‌ చేయాలంటూ న్యాయస్థానం నుంచి వచ్చిన ఆదేశాల కాపీని తహసీల్దార్‌, ఎస్‌ఐకి అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో కోట్‌పల్లి మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ నారాయణరెడ్డి, మాజీ సర్పంచు ప్రకాశం, రైతులు బిచ్చయ్య, దస్తయ్య, లాలయ్య, శ్రీనివాస్‌, సావిత్రమ్మ, దశరథ్‌, కిరణ్‌, బాలయ్య, భీమయ్య, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement