నకిలీ డీఏపీ పట్టివేత | - | Sakshi
Sakshi News home page

నకిలీ డీఏపీ పట్టివేత

Aug 2 2026 7:20 AM | Updated on Aug 2 2026 7:20 AM

49 బస్తాలు స్వాధీనం

బంట్వారం: నకిలీ డీఏపీ 49 బస్తాలు పట్టుబడ్డాయి. ఈ సంఘంటన మండల పరిధి రొంపల్లిలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ రైతులు కొందరు.. పెద్దేముల్‌కు చెందిన పి.రాజు దగ్గర డీఏపీని కొనుగోలు చేశారు. శనివారం పంటలకు వేసే సమయంలో అనుమానం రావడంతో వ్యవసాయ అఽధికారులకు సమాచారం అందించారు. ఈ మేరకు ఏఓ శ్రావ్య, ఎస్‌ఐ విమల గ్రామానికి చేరుకున్నారు. రైతులతో మాట్లాడి డీఏపీని పరిశీలించారు. ఐదు మంది రైతుల వద్ద 49 అనుమానాస్పద బస్తాలను స్వాధీనం చేసుకున్నామని ఏఓ తెలిపారు. శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపించామన్నారు. నకిలీ డీఏపీ విక్రయించిన రాజుపై కేసు నమోదు చేసి దర్యాప్తు, చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు. లైసెన్స్‌ కలిగిన డీలర్ల వద్దే ఎరువులు కొనుగోలు చేయాలని, బిల్లులు తప్పని సరిగా తీసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement