తాండూరు: స్థానిక ఎకై ్సజ్ శాఖ కార్యాలయంలో సోమవారం రెండు వాహనాలను వేలం వేస్తున్నట్లు తాండూరు ఎకై ్సజ్ సీఐ రాణి ఓ ప్రకటనలో తెలిపారు. సర్కిల్ పరిఽధిలో పలు రకాల కేసుల్లో పట్టుబడిన ద్విచక్ర వాహనాలను(టీవీఎస్ స్టార్ సిటీ, ఫ్యాషన్ ప్లస్) మధ్యాహ్నం 3 గంటలకు వేలం వేస్తున్నామని చెప్పారు. ప్రజలు ఈ వేలంలో పాల్గొని వాహనాలను సొంతం చేసుకోవాలని సూచించారు.
కొడంగల్ రూరల్: పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో అన్ని రకాల వసతులను కల్పించాలని ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం ఆస్పత్రిలో పలు వార్డులను సందర్శిస్తూ.. మరుగుదొడ్లు, తాగునీరు, బ్లడ్ బ్యాంకు, ఎమర్జెన్సీ ఆపరేషన్ థియేటర్, అన్ని రకాల సర్జన్లను నియమించాలన్నారు. ఆస్పత్రిలో అన్ని రకాల పరికరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు రాజుకుమార్‌గౌడ్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి మహిపాల్, డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్రామ్‌రెడ్డి, గురువయ్య తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఎన్నికల పర్యవేక్షణ అధికారి
నయిమత్‌అలీ
మోమిన్‌పేట: ఒక్కరికి ఒక ఓటు మాత్రమే ఉండాలని జిల్లా ఎన్నికల పర్యవేక్షణ అధికారి నయిమత్‌అలీ అన్నారు. ఆదివారం మండల పరిధిలోని మేకవనంపల్లి, మోమిన్‌పేట గ్రామాల్లో జరుగుతున్న సర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. దేశంలో ఎక్కడైన పౌరుడికి ఒక ఓటు మాత్రమే ఉంటుందన్నారు. గతంలో ఎక్కడ నివసిస్తే అక్కడ ఓటరుగా నమోదు చేసుకునే వారని, అందుకే ఒకటి రెండు చోట్ల ఓటరుగా నమోదు చేసుకునేవారని చెప్పారు. కానీ ప్రస్తుతం పూర్తిగా ఆన్‌లైన్ కావడంతో ఒక్క చోటే ఓటు హక్కు నమోదు చేసుకోవాలని సూచించారు. గడువు దగ్గర పడుతుందని, వేగంగా డిజిటలైజేషన్ చేయాలన్నారు. ఆయన వెంట బీఎల్‌ఓలు సుభాష్‌గౌడ్, కృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు.
తుర్కయంజాల్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఆగస్టు 10న నిర్వహించ తలపెట్టిన జైల్ భరో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.చంద్రమోహన్, ఉపాధ్యక్షుడు డి.కిషన్ పిలుపునిచ్చారు. రాగన్నగూడలోని సీఐటీయూ కార్యాలయం వద్ద ఆదివారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. గడిచిన కొన్ని రోజులుగా కార్మిక, రైతు, వ్యవసాయ వ్యతిరేక విధానాలకు నిరసనగా సీఐటీయూ, అఖిల భారత కిసాన్ సభ, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించనున్న జైల్ భరోలో అన్ని రంగాల కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యుడు ఎం.సత్యనారాయణ, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎ. భాస్కర్ రెడ్డి, లాయర్స్ యూనియన్ జిల్లా నాయకుడు కె.అరుణ్ కుమార్, నాయకులు ఐ.భాస్కర్, కె.వెంకటకృష్ణ, శ్రీనివాసులు, అండాలు తదితరులు పాల్గొన్నారు.
ఆమనగల్లు: తలకొండపల్లి మండలం దేవునిపడకల్‌లో రెండు రోజులుగా నిర్వహిస్తున్న జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ ఆదివారంతో ముగిసింది. పోటీలను మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి ప్రారంభించారు. టోర్నమెంట్‌లో 32 టీమ్‌లు పాల్గొన్నాయి. మొదటి బహుమతిని దేవునిపడకల్, రెండో బహుమతిని పడకల్, మూడో బహుమతిని పాపిరెడ్డిగూడ, నాలుగో బహుమతిని ఆకుతోటపల్లి టీమ్ గెలుచుకున్నాయి. విజేతలకు సర్పంచ్ కానుగుల అనిత మల్లేశ్ బహుమతులు అందించారు. కార్యక్రమంలో వాలీబాల్ యూత్ ప్రెసిడెంట్ పులిజాల మహేశ్, స్థానిక నాయకులు పాల్గొన్నారు.


