కొడంగల్ రూరల్: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని పట్టణంలోని తెలంగవాడలో ఆదివారం బోనాల పండగను ఘనంగా నిర్వహించారు. మత్స్య సహకార సంఘం, ముదిరాజ్ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో తెలంగవాడ నుంచి బండల ఎల్లమ్మ దేవాలయం వరకు మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా వెళ్లారు. పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలు, బాజాబజంత్రీలు చప్పుళ్లు చూపరులను కనువిందు చేశాయి. వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని అమ్మవారికి బోనాల నైవేద్యాలు సమర్పించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


