పూడూరు: న్యాయం చేయాలని ఆశ్రయించిన వారిపై అక్రమంగా కేసులు పెడుతున్న చన్గోముల్ పోలీస్‌స్టేషన్ ఎస్‌ఐ భరత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.వెంకటయ్య డిమాండ్ చేశారు. శనివారం పలువురు బాధితులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ విజయ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. సోమన్‌గుర్తి వాసి రైతు జైదుపల్లి నర్సింలుకు చెందిన 30 గుంటల పట్టా భూమిని టైర్ల కంపనీ ఆక్రమించి, ప్రహరీ నిర్మించారని ఫిర్యాదు చేస్తే.. అక్రమదారున్ని వదిలేసి బాధితుడిపై కేసు నమోదు చేశారని ఆరోపించారు. చన్గోముల్ గ్రామానికి చెందిన రాజు, కండ్లపల్లికి చెందిన ఆయూబ్‌ఖాన్‌లపై దాడి కేసులో ప్రధాన నిందితులను వదిలేసి, కేసును నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. అంగడిచిట్టంపల్లిలో భూ వివాదంలో అంగోత్ గణేశ్‌ను ఠాణాకు పిలిచి బెధిరించారని, ఇలా అవినీతి పరులకు కొమ్ముకాస్తున్న ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రామక్రిష్ణ, జిల్లా కోశాధికారి బుస్స చంద్రయ్య, కార్మిక సంఘం నాయకులు సత్తయ్య, హబీబ్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
అక్రమార్కులకు అండగా నిలిచిన ఎస్‌ఐ
అధికారిపై చర్యలకు ప్రజాసంఘాల డిమాండ్


