శంకర్‌పల్లి: అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మగ్గురు వ్యక్తులపై మోకిల పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ వీరబాబు తెలిపిన వివరాల ప్రకారం.. హోలీ పండుగ సందర్భంగా మద్యం దుకాణాలు మూసి ఉండడంతో కొంత మంది అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు పక్కా సమాచారం అందింది. ఠాణా పరిధిలోని మిర్జాగూడ, జన్వాడ, కొండకల్ గ్రామాల్లోని మూడు కిరాణా దుకాణ్లాలో పోలీసులు దాడులు చేశారు. మద్యం విక్రయిస్తున్నట్లు గుర్తించి, వారి నుంచి 20 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
మహిళ అదృశ్యం
పహాడీషరీఫ్: మానసిక స్థితి సరిగ్గా లేని మహిళ అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జల్‌పల్లి శ్రీరామ కాలనీకి చెందిన ఫాతిమా బేగం(45) భర్త ఖురేషీ చనిపోవడంతో ఒంటరిగా నివాసం ఉంటోంది. శాసీ్త్రపురంలో నివసించే ఆమె సోదరుడు ముస్తఫా నిత్యం ఆహారం తెచ్చిస్తుంటాడు. మానసిక స్థితి సరిగ్గా లేని ఆమె 15 రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదు. ఆమె సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని సూచించారు.


