బషీరాబ్యాడ్‌ బస్టాండ్‌! | - | Sakshi
Sakshi News home page

బషీరాబ్యాడ్‌ బస్టాండ్‌!

Mar 4 2026 9:05 AM | Updated on Mar 4 2026 9:05 AM

బషీరాబాద్‌: మూడు దశాబ్దాల క్రితం బషీరాబాద్‌లో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్‌ అక్కరకు రాకుండా పోతోంది. సుమారు ఎకరం స్థలంలో నిర్మించిన ప్రయాణ ప్రాంగణానికి బస్సులు రావడం లేదు. దీంతో పందులు, కుక్కలకు ఆవాసంగా మారింది. వర్షాకాలం, ఎండాకాలం అనే తేడా లేకుండా ప్రజలు, ప్రయాణికులు బస్సుల కోసం రోడ్ల పక్కన ఎదురు చూస్తూ అవస్థలు పడుతున్నారు.

కంపు కొడుతున్న పరిసరాలు..

తాండూరు బస్‌ డిపో నుంచి బషీరాబాద్‌ రూట్‌లో నిత్యం అనేక బస్సులు ప్రయాణిస్తుంటాయి. వీటిలో తాండూరు– బషీరాబాద్‌ లోకల్‌, తాండూరు– సేడం, తాండూరు జీవన్గీ, తాండూరు– క్యాద్గీరా, తాండూరు– జీవన్గీ, తాండూరు– కొత్లాపూర్‌, తాండూరు మైల్వార్‌ సర్వీసులు ఎక్కువగా ఉంటాయి. బస్టాండ్‌ వాడుకలో లేకపోవడంతో మురికి కూపంగా మారి, కంపు కొడుతోంది. మరుగుదొడ్లు, మూత్రశాలల చుట్టూ ముళ్ల పొదలు, పిచ్చిమొక్కలు పెరిగాయి. బస్టాండ్‌ ఆవరణ మొత్తం చెత్తాచెదారం తిష్టవేసింది. విద్యుత్‌ పరికరాలు, నీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా పాడైంది.

రైల్వే ట్రాక్‌ దాటుతూ..

మండల కేంద్రం నుంచి వివిధ ప్రాంతాలకు ప్రయాణించే వారు రైల్వే స్టేషన్‌ ముందు, అంబేడ్కర్‌ చౌరస్తా పక్కన వేచి ఉంటున్నారు. మైల్వార్‌, కొత్లాపూర్‌ రూట్‌లలో వేళ్లే బస్సుల కోసం రైల్వే ట్రాక్‌ దాటుతూ ప్రమాదాల బారిన పడంతో పాటు ప్రాణాలు కూడా కోల్పోయారు. రైల్వే స్టేషన్‌ నుంచి అంబేడ్కర్‌ చౌక్‌కు రావడానికి కూడా అదే రైల్వే లైను దాటి రావాల్సి వస్తోంది. దీంతో ప్రయాణికులు ఏళ్లుగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పందులు, కుక్కలకు

ఆవాసంగా మారిన వైనం

ఏళ్లుగా నిలిచిపోయిన

బస్సుల రాకపోకలు

ఎండైనా, వానైనా రోడ్ల పక్కనే

వేచి చూస్తున్న ప్రయాణికులు

అందుబాటులోకి తీసుకురావాలని ప్రజల విజ్ఞప్తులు

అందుబాటులోకి తేవాలి

ఆర్టీసీ బస్టాండ్‌లో నేను ఇప్పటి వరకు బస్సులు చూడలేదు. రూ.లక్షలు ఖర్చుపెట్టి నిర్మించి నిరుపయోగంగా వదిలేశారు. బస్టాండులో వసతులు కల్పించి అందుబాటులోకి తీసుకువస్తే ప్రయాణికులకు సౌకర్యవంతంగా ఉంటుంది. అధికారులు ఇప్పటికై నా స్పందించాలి.

– ప్రశాంత్‌, బషీరాబాద్‌

సత్వరమే చర్యలు తీసుకుంటాం

బస్టాండ్‌ విషయాన్ని స ర్పంచ్‌లు, ప్రయాణికులు అనేకసార్లు మా దృష్టికి తీ సుకురాగా డీఎంతో చర్చించాం. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి బస్టాండులో వసతులు కల్పిస్తాం. బషీరాబాద్‌ మీదుగా ప్రయాణించే ప్రతీ ఆర్టీసీ బస్సు ఇక్కడ 5 నిమిషాలు ఆగేలా చర్యలు తీసుకుంటాం. ఇందుకు స్థానిక జీపీ సహకారం కూడా తీసుకుంటాం.

– సంపత్‌కుమార్‌, ఎంపీడీఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement