అనంతగిరి: చంద్రగ్రహణం పురస్కరించుకుని వికారాబాద్‌కు సమీపంలోని అనంతగిరిగుట్ట దేవాలయంతో పాటు పట్టణంలోని అన్ని దేవాలయాల్లో మంగళవారం ఉదయం ప్రత్యేక పూజల అనంతరం మూసి వేశారు. రాత్రి 8 గంటల తర్వాత ఆలయాలను శుద్ధి చేశారు. బుధవారం ఉదయం నుంచి భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
రాత్రి 7గంటలకు సంప్రోక్షణ
నేడు 8 గంటలకు దర్శనం
కుల్కచర్ల: మండల పరిధిలోనలి పాంబండ రామలింగేశ్వర దేవస్థానంలో మంగళవారం ఉదయం తెల్లవారుజామున స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించి ఆలయ అర్చకులు పాండు శర్మ తదితరులు ఆలయాన్ని మూసివేశారు. చౌడాపూర్ మండలం మందిపల్ గ్రామంలోని శ్రీ ఓంకారేశ్వర స్వామి దేవాలయంలో ఆలయ అర్చకులు మఠం రాజశేఖర్ స్వామివారికి ప్రత్యేకపూజలు చేసి ఆలయాన్ని మూసివేశారు. బుధవారం ఉదయం 8గంటల ప్రాంతంలో ఆలయాన్ని సంప్రోక్షణ చేసి భక్తులకు దర్శన సౌకర్యం కల్పింస్తామని అర్చకులు చెప్పారు.


