కడ్తాల్: కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు గుర్క జైపాల్‌యాదవ్‌కు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి మంగమ్మ (95) వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో కన్నుమూశారు. విషయం తెలుసుకున్న కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీ రాములు, షాద్‌నగర్, కొడంగల్ మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్, నరేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, క్యామ మల్లేశ్, ఉప్పల వెంకటేశ్, బాలాజీసింగ్, పీసీసీ సభ్యుడు అయిళ్ల శ్రీనివాస్‌గౌడ్, మార్కెట్ వైస్ చైర్మన్ భాస్కర్‌రెడ్డి, గిరిజన సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు హన్మానాయక్, డీసీసీబీ డైరెక్టర్ గంప వెంకటేశ్, సర్పంచ్‌ల సంఘం మాజీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహరెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి శ్రీనివాస్‌రెడ్డి, తదితరులు చల్లంపల్లి గ్రామానికి చేరుకుని మంగమ్మ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జైపా ల్‌యాదవ్‌ను పరామర్శించారు.
జైపాల్‌యాదవ్‌కు హరీశ్‌రావు ఫోన్
మాజీ మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర తదితరులు జైపాల్‌యాదవ్‌కు ఫోన్ చేసి సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జనసందోహం మధ్య అంతిమయాత్ర నిర్వహించారు. చల్లంపల్లిలోని వారి వ్యవసాయ క్షేత్రంలో మంగమ్మ అంత్యక్రియలు పూర్తి చేశారు.
నివాళులర్పించిన ఆయా పార్టీల నేతలు


