ధారూరులో ఎక్స్‌ప్రైస్ రైళ్లు ఆగేలా చూడండి
కేంద్ర రైల్వే శాఖ మంత్రికి
ఎంపీ కొండా లేఖ
ధారూరు: మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్‌లో హుబ్లీ, బీజాపూర్ ఎక్స్‌ప్రైస్ రైళ్లు ఆగేలా చర్యలు తీసుకోవాలని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. శనివారం ఈ మేరకు లేఖ రాశారు. కోవిడ్ సమయంలో ఈ స్టేషన్‌లో రైళ్ల నిలపడాన్ని ఆపేశారని, దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొ న్నారు. హుబ్లీ, బీజాపూర్ ఎక్స్‌ప్రైస్ రైళ్లు ఆగేలా చూడాలని కోరారు.
ఉత్తమ ఉపాధ్యాయురాలిగా రమణకుమారి
దుద్యాల్: సావిత్రి బాయి పూలే జయంతిని పురస్కరించుకొని రాష్ట్రస్థాయి ఉత్తమ మహిళా ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. మండలంలోని హకీంపేట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ రమణకుమారి సావిత్రబాయి పూలే ఎక్స్‌లెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. శనివారం నగరంలోని రవీంద్రభారతిలో పురస్కారం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అవార్డు తన బాధ్యతలను మరింత పెంచిందని పేర్కొన్నారు.
లక్ష్యం మేరకు
ఓటరు మ్యాపింగ్
అనంతగిరి: నిర్దేశించిన లక్ష్యం మేరకు ఓటరు మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేస్తామని ఇన్‌చార్జ్ అడిషనల్ కలెక్టర్ రాజేశ్వరి తెలిపారు. శనివారం నగరం నుంచి రాష్ట్ర ఎన్నిక అధికారి సుదర్శన్ రెడ్డి అన్ని జిల్లాల అధికారులతో ఓటరు మ్యాపింగ్ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం రాజేశ్వరి మాట్లాడుతూ.. జిల్లాలో రోజువారీగా నిర్దేశించిన లక్ష్యం మేరకు 16,264 ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటి వరకు 52.65 శాతం పూర్తి చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మంగీలాల్, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్ నైమత్ అలీ, వికారాబాద్ తహసీల్దార్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
రేపు ఇందిరమ్మ
ఇల్లు ప్రారంభోత్సవం
తాండూరు రూరల్: మండలంలోని అంతారం అనుబంధ గ్రామం దస్తగిరిపేట్‌లో ఇందిరమ్మ ఇల్లు పూర్తయ్యింది. సోమవారం ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి చేతుల మీదగా ప్రారంభిచనున్నట్లు లబ్ధిదారుడు సాధిక్ తెలిపారు. ఎన్నో ఏళ్ల సొంతింటి కల కాంగ్రెస్ ప్రభుత్వంలో నేరవేదిందని తెలిపారు. నూతనంగా నిర్మించిన ఇంటి వద్ద ఫొటో దిగి సంబురపడ్డారు.
గోనూర్‌లో అర్ధరాత్రి హైడ్రామా
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న
బీఆర్‌ఎస్ నాయకులు
తాండూరు రూరల్: మండలంలోని గోనూర్ గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. గ్రామ శివారులోని కాగ్నా వాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలించేందుకు కొందరు ట్రాక్టర్లతో వెళ్లారు. విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ గ్రామ నాయకుడు గోపాల్‌రెడ్డి తన అనుచరులతో కలిసి వాగు వద్దకు వెళ్లాడు. డయల్ 100కు కాల్ చేసి సమాచారం ఇచ్చాడు. విషయం పసిగట్టిన అక్రమార్కులు ఖాళీ ట్రాక్టర్లతో వెనుదిరిగారు. కాగ్నా వాగు నుంచి ఇసుక తరలిస్తే సహించేది లేదని గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి ఇసుక అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని గోనూర్ ప్రజలు కోరారు.
ధారూరులో ఎక్స్‌ప్రైస్ రైళ్లు ఆగేలా చూడండి


