పాడి పరిశ్రమపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
కొడంగల్ రూరల్: పాడి పరిశ్రమపై రైతులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పశు సంవర్ధక శాఖ జిల్లా అధికారి సదానందం, డాక్టర్ అనూశ్రీ, సూచించా రు. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పాల దిగుబడిని పెంచుకోవచ్చని తెలిపారు. శనివారం మండలంలోని పెద్దనందిగామ, పర్సాపూర్ గ్రామా ల్లో టీజీఎల్‌ఎస్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన పశు వైద్య శిబిరంలో పాడి రైతులకు సూచనలు, సలహాలు అందించారు. అంతకుముందు ఆయా గ్రామాల్లో సర్పంచులు చెన్‌బస్‌కుమార్, కన్నం రాధ వేర్వేరుగా శిబిరాలను ప్రారంభించారు. పశువుల ఆరోగ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు. గర్భకోశ వ్యాధి నివారణ, గొర్రెలు, మేకల్లో నట్టల నివారణకు మందు వేయాలని సూచించారు. 127 జీవాలకు వైద్యం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. మూగ జీవాలకు సేవ చేయడంతో మనసు ప్రశాంతంగా ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కన్నం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు హన్మంత్‌రెడ్డి, రామకృష్ణయ్య, భీమప్ప, పశు వైద్య సిబ్బంది డాక్టర్ శ్రీకర్‌రెడ్డి, డాక్టర్ పరమేష్‌కుమార్, జేవీఓ వెంకటయ్య, గోపాలమిత్రలు శివకుమార్, రాకేష్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


