దొంగ ఎన్కేపల్లి పేరు మార్చండి
దోమ: దొంగ ఎన్కేపల్లి పేరు కారణంగా విద్యావేత్తలు, విద్యార్థులు మానసికంగా బాధపడుతున్నారని పరిగి ఎమ్మెల్యే టీ రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో ఆయనకు మాట్లాడే అవకాశం వచ్చింది. దోమ మండలంలోని దొంగ ఎన్కేపల్లి పేరును సంజీవనగర్‌గా మార్చాలని కోరారు. ఈ గ్రామంలో సంజీవస్వామి పురాతన ఆలయం ఉందని ఆ పేరును గ్రామానికి పెట్టాలని విన్నవించారు. గతంలో ఇదే విషయాన్ని మంత్రులు, కలెక్టర్ దృష్టికి తెచ్చినట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేలా సంజీవనగర్ పేరును ఏర్పాటు చేయాలన్నారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.
అసెంబ్లీలో కోరిన ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి


