కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం
అనంతగిరి: గ్రామస్థాయి నుంచే కబడ్డీ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఊశిరెడ్డి అన్నారు. శనివారం వికారాబాద్ పట్టణంలో కబడ్డీ అసోసియేషన్ రాష్ట్రస్థాయి ముఖ్య ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. ముందుగా సావిత్రి జ్యోతిబాపులే చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లలర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే నెలలో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పోటీల్లో ఉన్నతంగా రాణించే యువతీయువకులను ప్రోత్సహిస్తామని, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునేలా చూస్తామని తెలిపారు. రాష్ట్ర కమిటీలో పలు పదవులున త్వరలో భర్తీ చేస్తామని ప్రకటించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గడిల శ్రీకాంత్‌గౌడ్, జిల్లా అధ్యక్షుడు రాఘవన్‌నాయక్, కోశాధికారి శ్రీనివాస్‌గౌడ్, ఉపాధ్యక్షుడు విజయ్‌నాయక్, అడ్వయిజర్ పెండ్యా అనంతయ్య తదితరులు పాల్గొన్నారు.


