తాండూరు మున్సిపాలిటీ బీజేపీదే
తాండూరు: మున్సిపల్ ఎన్నికల్లో తాండూరుపై బీజేపీ జెండా ఎగురవేస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు యు.రమేశ్‌కుమార్, పార్టీ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల కన్వీనర్ బాలేశ్వర్‌గుప్తా అన్నారు. శనివారం వారు పట్టణంలో పార్టీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పట్టణంలోని హిందువులంతా ఏకం కావాలన్నారు. యువత మున్సిపల్ ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్దమవుతున్నారని చెప్పారు. గతంలో తాండూరు మున్సిపాలిటీని రెండు సార్లు బీజేపీ కై వసం చేసుకుందని గుర్తు చేశారు. 2020 ఎన్నికల్లో ఏడుగురు కౌన్సిలర్‌లు బీజేపీ నుంచి విజయం సాధించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మనోహర్‌రావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు లలిత, శ్రీలత, పార్టీ పట్టణ అధ్యక్షుడు మల్లేశం, నాయకులు శాంతుకుమార్, పటేల్ విజయ్‌కుమార్, భద్రేశ్వర్, కిరణ్, రజినీకాంత్, జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేశ్‌కుమార్


