ఆర్టీసీ బస్సు టైర్ బ్లాస్ట్
తప్పిన పెను ప్రమాదం
బషీరాబాద్: ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. శనివారం మధ్యాహ్నం సేడం నుంచి తాండూరు వస్తున్న ఆర్టీసీ బస్సు(టీజీ34జడ్0076) బషీరాబాద్ తహసీల్దార్ కార్యాలయం సమీపంలోకి రాగానే ముందలి టైర్ బ్లాస్ట్ అయ్యింది. అప్రమత్తమైన డ్రైవర్ నాగేంద్రప్ప బస్సును నిలిపివేశాడు. ఈ ఘటనలతో బస్సులో ప్రయాణిస్తున్న 25మంది ప్రయాణికులు ఉలిక్కిపడ్డారు. బస్సు వేగంగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. మెకానిక్ వచ్చి మరో టైర్ అమార్చడంతో ప్రయాణికులతో బస్సు తాండూరుకు బయలుదేరింది.
సీపీఎం జిల్లా కార్యదర్శి మహిపాల్
బంట్వారం: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హమీలన్నింటిని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆర్.మహిపాల్ డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని తొర్మామిడిలో పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిపాల్ మాట్లాడుతదూ.. కర్ణాటక సరిహద్దులోని బంట్వారం మండలం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. రోడ్లు పాడై ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారానికి అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలన్నారు. బస్సు సర్వీసుల సంఖ్యను పెంచాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేయాలని, చెరుకు, పసుపు, పత్తి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. తొర్మామాడి ఏరియాలో అక్రమ మైనింగ్‌కు అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హమీ పేరు మార్పు సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు శ్రీనివాస్, లక్ష్మణ్, నర్సింలు, ఏసయ్య, వసంత్, లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
పరిగి సీఐ శ్రీనివాస్‌రెడ్డి
పరిగి: ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తే చర్యలు తప్పవని పరిగి సీఐ శ్రీనివాస్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆయన పట్టణ కేంద్రంలో మున్సిపల్ కమిషనర్ వెంకటయ్యతో కలిసి ఫుట్‌పాత్‌లు ఆక్రమించిన వారు ఖాలీ చేయాలని సూచించారు. అనంతరం సీఐ మాట్లాడుతూ.. పాదచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లపై వ్యాపారాలు నిర్వహిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పారు. ఫుట్‌పాత్‌లను వెంటనే ఖాలీ చేయాలని లేదంటే కఠిన చర్యలుఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ మోహన్‌కృష్ణ తదితరులు ఉన్నారు.
రేపు అథ్లెటిక్స్ పోటీలు
హుడాకాంప్లెక్స్: జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 5న జిల్లా స్థాయి సబ్‌జూనియర్, అండర్–20 అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ సెక్రటరీ ఇ.గోపి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని తెలిపారు. అండర్–8, అండర్–10, అండర్–12, అండర్–14, అండర్–20 విభాగాల్లో పోటీలు ఉంటాయన్నారు. పూర్తి వివరాల కోసం జిల్లా అథ్లెటిక్స్ కోచ్ తిప్పాన సాయిరెడ్డిని 97038 38987 నంబర్‌లో సంప్రదించాలని సూచించారు.
ఆర్టీసీ బస్సు టైర్ బ్లాస్ట్
ఆర్టీసీ బస్సు టైర్ బ్లాస్ట్


