సీఎంను కలిసిన బీఎంఆర్
తాండూరు: తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నగరంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
డీఏఓ రాజరత్నం
అనంతగిరి: యాసంగి పంటలకు సరిపడా యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయాధికారి రాజరత్నం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం 3,545 మెట్రిక్ టన్నుల యూరియా ఉందని, కావాల్సిన రైతులు ఆయా మండలాల్లోని డీలర్లను సంప్రదించాలని సూచించారు. ఏమైనా ఇబ్బందులు తలెత్తితే తమ దృష్టికి తేవాలన్నారు.
అనంతగిరి: యూటీఎఫ్ జిల్లా కమిటీ నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని శుక్రవారం స్పీకర్ ప్రసాద్‌కుమార్ ఆవిష్కరించారు. హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో జరిగిన కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వెంకటరత్నం, కార్యదర్శులు బాబురావు, పవన్‌కుమార్, బసప్ప, వినోద్‌కుమార్ పాల్గొన్నారు.
అనంతగిరి: జిల్లాకు చెందిన పలువురు బీజేపీ ముఖ్య నేతలు శుక్రవారం ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ కన్వీనర్ కరణం ప్రహ్లాద్‌రావు, జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రమేష్‌కుమార్, అసెంబ్లీ కోర్డినేటర్ వడ్ల నందు, సీనియర్ నాయకులు పాండు గౌడ్, రాజునాయక్, భద్రేఽశ్వర్, ఉపేందర్, పెద్ద సంతోష, శ్రీకాంత్‌రెడ్డి, వెంకటయ్య, పరమేష్, అంజయ్య, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి: కార్లు, ఇతర వాహనాలు నడిపై వారు సీటు బెల్టు తప్పనిసరిగా ధరించాలని జిల్లా రవాణా శాఖ అధికారి పీ వెంకట్‌రెడ్డి సూచించారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం జిల్లా కార్యాలయ ఆవరణలో వాహనదారులతో కలిసి ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వికారాబాద్ – హైదరాబాద్ మార్గంలో వాహనాల తనిఖీ చేశారు. హెల్మెట్ లేకుండా, సీటు బెల్టు పెట్టుకోకుండా వాహనాలు నడిపే వారికి గులాబీ పువ్వు ఇచ్చి ట్రాఫిక్ రూల్స్‌పై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వికారాబాద్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ సురేందర్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్: దివ్యాంగుల వివాహానికి ప్రభుత్వం రూ.లక్ష కానుకగా ఇస్తోందని, ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారి శ్రీలత శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకోసం వధువు లేదా వరుడు కనీసం 40 శాతం దివ్యాంగత సర్టిఫికె ట్ కలిగి ఉండాలని, వివాహం చట్టబద్ధంగా నమోదు చేసి ఉండాలన్నారు. వివాహం జరిగిన సంవత్సరం లోపు దరఖాస్తు సమర్పించాలని తెలిపారు. అన్ని పత్రాలతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొవచ్చన్నారు.
సీఎంను కలిసిన బీఎంఆర్
సీఎంను కలిసిన బీఎంఆర్
సీఎంను కలిసిన బీఎంఆర్


