సత్వరం ప్రారంభించండి
● ముందుగా హాస్టల్ నిర్మాణాలు చేపట్టాలి
● ఎడ్యుకేషన్ హబ్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతి రెడ్డి
దుద్యాల్: విద్యాసంస్థల ఏర్పాటులో భాగంగా చేపడుతున్న పనులను వెంటనే ప్రారంభించి సకాలంలో పూర్తి చేయాలని ఎడ్యుకేషన్ హబ్ మేనేజింగ్ డైరెక్టర్ గణపతిరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని హకీంపేట్‌లో విద్యాలయాల కోసం కేటాయించిన భూములను, జరుగుతున్న పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ముందుగా హాస్టల్ భవన నిర్మాణాలను ప్రారంభించాలన్నారు. విద్యాలయాలకు సరైన రోడ్డు మార్గాలు ఉన్నాయా.. లేదా అని పరిశీలించారు. ప్రతి వారం పనుల పరిశీలనకు వస్తానని పురోగతి కనిపించాలని ఆదేశించారు. కార్యక్రమంలో కడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ కిషన్, ఎంపీడీఓ జైపాల్‌రెడ్డి, ఎడ్యుకేషన్ హబ్ ప్రాజెక్ట్ సీఈ శశిధర, సీఈ రెగ్యులర్ షఫీమియా, ఈఈ విజయభాస్కర్ రెడ్డి, డెప్యూటీ ఈఈ రాజయ్య, మెడికల్ కాలేజ్ ఎస్‌ఎస్ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి ఆనందం, నాయకులు నర్సింహారెడ్డి, శ్రీనివాస్, వెంకటేశ్, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


