స్సీకర్‌కు శుభాకాంక్షలు
అనంతగిరి: వికారాబాద్ మార్కెట్ కమిటీ చైర్మ న్ శ్రీనివాస్ ముదిరాజ్ శాసన సభ స్పీకర్ ప్రసాద్‌కుమార్‌ను నగరంలోని ఆయన నివా సంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ను సన్మానించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
పుష్పగుచ్ఛం అందజేసి.. అవగాహన కల్పించి
పరిగి: ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పా టించాలని ఎంవీఐ వీరేంద్రనాయక్ అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆయన వాహనదారుల కు పుష్పగుచ్ఛం అందజేసి, అవగాహన కల్పించారు. మద్యం తాగి వాహనాలు నడపొద్దని చెప్పారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, పోర్ వీలర్ చోదకులు సీటుబెల్టు పెట్టుకోవా లని సూచించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విషాహారం తిని..
చిన్నారి మృతి
ఇబ్రహీంపట్నం: విష ఆహారం తిని ఐదుగురు అస్వస్థతకు గురికాగా, మూడేళ్ల చిన్నారి మృతి చెందింది. ఈ ఘటన యాచారం ఠాణా పరిధి లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. తమ్మలోనిగూడలోని పృథ్వీచారి ఫౌల్ట్రీ ఫారంలో జాయ్‌దోర్ అలీ, రోమేసా ఖాతమ్‌లు పనిచేస్తూ అక్కడే నివసిస్తుంటారు. సాయిరెడ్డిగూడెం నివసిస్తూ మరో ఫౌల్ట్రీ ఫారంలో పనిచేసే వారి బంధువులు అబ్దుల్ మాలిక్, బనేసా ఖాతుమ్, మాముని, అరిపుల(3) జామ్‌దోర్ అలీ ఇంటికి వచ్చారు. రాత్రి బంగాళదుంప, బొమ్మిడి చేపలతో భోజనం చేశారు. ఏమైయిందో ఏమోగాని ఆ భోజనం చేసిన వెంటనే వారు అస్వస్థతకు గురయ్యారు. బాధితులను ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నా రు. నిలోఫర్‌లో చికిత్స పొందుతున్న అరిపుల్ మృతి చెందింది. మిగలిన వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలిపారు.
వ్యక్తి అదృశ్యం
కేశంపేట: మండల పరిధిలోని అల్వాల గ్రామంలో వ్యక్తి అదృశ్యమయ్యాడు. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన కారింగ జంగయ్య(55) గురువారం సాయంత్రం కేశంపేటకు వెళ్లినట్టు గ్రామస్తులు తెలిపారు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బంధువుల వద్ద, సమీపంలో వెతికినా ఆచూకీ లభించలేదు. దీనిపై జంగయ్య భార్య సుశీల శుక్రవారం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ నరహరి తెలిపారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి
యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్
కడ్తాల్: ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ కృషి చేస్తోందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు గోపాల్‌నాయక్ అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ముద్వీన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో టీఎస్ యూటీఎఫ్ కడ్తాల్ మండల శాఖ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్‌ను సంఘం నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోపాల్‌నాయక్ మాట్లాడుతూ అధ్యాయనం, ఆధ్యాపనం, సామాజిక స్పృహ అనే లక్ష్యాలతో హక్కులు బాధ్యతలు ఉద్యమ నేత్రాలుగా విద్యారంగ సమస్యల పరిష్కారానికి టీఎస్‌యూటీఎఫ్ కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ నిర్మల, టీఎస్‌యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి శంకర్‌నాయక్, యూటీఎఫ్ మండల అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి కృష్ణ, ఉపాధ్యక్షుడు మల్లయ్య, సభ్యులు నర్సింహ మూర్తి, రాజు, సత్యనారాయణ, రఘుపతి, రవీంద్రారెడ్డి పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
ఇబ్రహీంపట్నం: బైక్, కారు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన యాచారం పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. చింతపట్ల గ్రామానికి చెందిన జి.శ్రీకాంత్, కె.సిద్దు ఇబ్రహీంపట్నం నుంచి స్వగ్రామానికి బైక్ వెళుతున్నారు. యాచారం వైపు నుంచి వస్తున్న కారు చౌదర్‌పల్లి గేట్ సమీపంలో వీరి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు కిందపడటంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికుల సహాయంలో గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
స్సీకర్‌కు శుభాకాంక్షలు


