గ్రామాల అభివృద్ధిలో కేంద్రం పెద్దన్న పాత్ర
కందుకూరు: గ్రామాల అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషిస్తోందని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి, మండల అధ్యక్షుడు నిమ్మ అంజిరెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మండల పరిధిలో పార్టీ మద్దతుతో గెలిచిన 12 పంచాయతీలకు చెందిన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఎంపీని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం నుంచి సీసీ రోడ్లు, వీధి దీపాలు, డ్రైనేజీలు, శ్మశానవాటిలకు, ఉపాధిహామీ పథకం, మహిళా సంఘాలకు రుణాలు, బీటీ రోడ్లు, చెట్ల పెంపకం వంటి వాటికి 80 శాతం నిధులు వస్తాయన్నారు. నిరుపేదలకు ఉచిత బియ్యం, రైతులకు సబ్సిడీలో ఎరువులు సరఫరా చేస్తోందన్నారు. గ్రామాలకు తన వంతుగా నిధులు అందించి సహకరిస్తానని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకుడు పల్లె కృష్ణగౌడ్, జిల్లా కార్యదర్శి తేరటి లక్ష్మణ్‌ముదిరాజ్, సీనియర్ నాయకులు జిట్టా రాజేందర్‌రెడ్డి, సురసాని ఎల్లారెడ్డి, అనేగౌని అశోక్‌గౌడ్, మాజీ సర్పంచ్ గౌర ప్రభాకర్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు బక్క మల్లేష్, పీఏసీఎస్ డైరెక్టర్ గౌర పర్వతాలు పాల్గొన్నారు.
చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి


