నాడు ఆదరణ.. నేడు కనుమరుగు
● కానరాని గ్రీటింగ్ కార్డుల జాడ
● సామాజిక మాధ్యమే వేదికగా
శుభాకాంక్షలు
దుద్యాల్: కొత్త సంవత్సరం వచ్చిందంటే చాలు బంధువులు, స్నేహితులకు శుభాకాంక్షలు చెప్పుకోవడం మన ఆనవాయితీ. అలాగే పండుగలు, వివాహ వార్షికోత్సవాలు, ప్రేమికుల రోజు ఇలా రకరాల ప్రత్యేక రోజుల్లోనూ అదే ఒరవడిని కొనసాగించేవారు. అయితే ఇందులో గతంలో గ్రీటింగ్ కార్డులు ముఖ్య పాత్ర పోషించేవి. అందమైన కార్డులను సేకరించి, నచ్చిన సందేశాలను అక్షర రూపంలో పొందుపరచి, కవర్లో పెట్టి, పోస్టుద్వారా సన్నిహితులకు పంపేవారు. కానీ మారుతున్న కాలంతో పాటు.. క్రమేనా అవి కనుమరుగయ్యాయి. అంతా ఆన్‌లైన్ మయం కావడంతో వాటి గురించి మాట్లాడే వారే లేరు. సాంకేతికతను అందిపుచ్చుకొని, సామాజిక మాధ్యమాల వేదికగా శుభాకాంక్షలు, అభినందనలను తెలుపుకొంటున్నారు.


