కాంగ్రెస్ నాయకుల అత్యుత్సాహం తగదు
అనంతగిరి: కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, బీఆర్‌ఎస్ శ్రేణులపై అక్రమంగా కేసులు పెడుతూ భయాందోళనకు గురిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, రోహిత్‌రెడ్డి మండిపడ్డారు. ఇలాంటివి మానుకోవాలని హితవు పలికారు. సోమవారం పార్టీ నాయకులతో కలసి ఎస్పీ స్నేహమెహ్రకు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడారు. గతంలో ఇలాంటివి జరగలేదన్నారు. కొందరు పోలీసులు ఆ పార్టీ నాయకులకు అండగా ఉన్నారని, అందుకే వారు ఇలా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వికారాబాద్ పట్టణంలోని శివారెడ్డిపేట చెరువు కబ్జాకు కొందరు పాల్పడుతున్నారని, తగిన ఆధారాలతో బయటపెడతామని పేర్కొన్నారు. పోలీసులు అందరినీ సమాన దృష్టితో చూడాలని సూచించారు. ఇందులో బీఆర్‌ఎస్ కోట్‌పల్లి మండల అధ్యక్షుడు సుందరి అనిల్, మండల అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ అనంత్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యేలు ఆనంద్, రోహిత్‌రెడ్డి


