తాండూరు బాలికలు.. క్రికెట్ రాణులు
● ఎస్‌జీఎఫ్ జాతీయ స్థాయి పోటీలకు ఇద్దరు, బీసీసీఐ ట్రోఫీకి ఇద్దరు ఎంపిక
● హర్షం వ్యక్తం చేస్తున్న తల్లిదండ్రులు, క్రీడాభిమానులు
తాండూరు టౌన్: క్రికెట్‌లో తాండూరు బాలికలు దూసుకెళ్తున్నారు. జాతీయ స్థాయి, బీసీసీఐ ట్రోఫీలకు అర్హత సాధించారు. పట్టణానికి చెందిన రామబ్రహ్మం, కవిత దంపతుల కూతురు సాయి సుదీష్ణ శెట్టి అండర్–19 బాలికల విభాగంలో ఎస్‌జీఎఫ్ తరపున జాతీయ స్థాయి పోటీలుకు బౌలర్‌గా, రమాకాంత్ పండిట్, జ్యోతి పండిట్‌ల కూతురు ఆంచల్ పండిట్ బ్యాట్స్‌విమెన్‌గా ఎంపికయ్యారు. ప్రస్తుతం వీరు తాండూరులోని సహారా క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. జనవరి 1వ తేదీ నుంచి మధ్యప్రదేశ్‌లోని శివపురిలో నిర్వహించనున్న ఎస్‌జీఎఫ్ జాతీయ స్థాయి క్రికెట్ టోర్నీలో వీరు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా సాయి సుదీష్ణ శెట్టిని ఆదివారం సహారా క్రికెట్ అకాడమీ కోచ్‌లు జగన్నాథ్ రెడ్డి, సతీశ్, శరత్‌సింగ్, ఆర్బీఓఎల్ ఎండీ, సీఈఓ బుయ్యని సరళ, సెయింట్ మేరీస్ పాఠశాల యాజయాన్యం ఘనంగా సన్మానించారు.
బీసీసీఐ ట్రోఫీకి మరో ఇద్దరు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ)ఆధ్వర్యంలో ప్రకటించిన బీసీసీఐ మహిళల అండర్–15 విభాగంలో పట్టణానికి చెందిన ఇద్దరు బాలికలకు చోటు దక్కింది. కరుణాకర్ రెడ్డి, మమత దంపతుల కుమార్తె భవిష్య రెడ్డి ఆల్‌రౌండర్‌గా ఎంపికై ంది. గౌరీ, పాండు దంపతుల కూతురు ప్రతీక కీపర్, బ్యాట్స్‌విమెన్‌గా ఎంపికై ంది. వీరిద్దరూ జనవరి 2వ తేదీ నుంచి విజయనగరం వేదికగా జరుగనున్న బీసీసీఐ అండర్–15 టోర్నీలో పాల్గొననున్నారు. భవిష్య రెడ్డి వరుసగా రెండోసారి బీసీసీఐ టోర్నీకి ఎంపికవడం విశేషం. ఈ ఘనత సాధించిన భవిష్య రెడ్డి, ప్రతీకను లెజెండ్ క్రికెట్ అకాడమీ కోచ్‌లు ఎండి సాహిల్, ఎండి సోహైల్‌తో పాటు పలువురు పట్టణవాసులు అభినందించారు.
తాండూరు బాలికలు.. క్రికెట్ రాణులు
తాండూరు బాలికలు.. క్రికెట్ రాణులు
తాండూరు బాలికలు.. క్రికెట్ రాణులు


