నారు దశ.. జాగ్రత్తలతో రక్ష
దుద్యాల్: యాసంగి సీజన్ మొదలైంది. పైరు దృఢంగా పెరగాలంటే విత్తనం బలంగా ఉండాలి. రైతులు ప్రస్తుతం దమ్ము చేయడం, నారుమడుల పనుల్లో నిమగ్నమయ్యారు. విత్తనాల ఎంపికలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. భారీ వర్షాలతో ప్రస్తుతం చెరువులు, కుంటలు, బావుల్లో నీరు సమృద్ధిగా ఉన్నాయి. ప్రస్తుతం రైతులు వెదజల్లే పద్ధతిని అవలంబిస్తున్నారు. నారు మడుల విధానంలో మొలక శాతం తక్కువగా ఉన్నట్‌లైతే వరి నారు కొరత ఏర్పడుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు విత్తనాల ఎంపికలో రైతులు జాగ్రతలు తీసుకోవడంతో పాటు విత్తనాల్లో మొలక శాతాన్ని పరిశీలించుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.
80 గింజల కంటే ఎక్కువగా
రైతులు మొలక కట్టేముందు విత్తనాలను ఎంపిక, నాణ్యతను పరిశీలించాలి. విత్తనాలను ముందుగా పలుచని గుడ్డ తీసుకుని నాలుగు మడుతలుగా చేసి 100 వరి గింజలను తీసుకుని 24 గంటల పాటు నీటిలో నానబెట్టాలి. తరువాత పొడి గుడ్డలో వేసి గాలి తగలకుండా చూడాలి. నాలుగు నుంచి ఐదు రోజుల తర్వాత పరిశీలిస్తే 80 గింజల కంటే ఎక్కువగా మొలకెత్తితే అని నాణ్యమైన విత్తనంగా భావించాలి. మేలైన రకాలను ఎంపిక చేసుకోవడం ద్వారానే పైరు ఆరోగ్యంగా పెరిగి ఆశించిన దిగుబడులు సాధించవచ్చు.
డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త, ఏరువాక కేంద్రం, వికారాబాద్
వరిలో నారుమడే కీలకం
విత్తనాల ఎంపికతో మేలైన దిగుబడులు
నారు దశ.. జాగ్రత్తలతో రక్ష


