మాస్టర్ అథ్లెటిక్స్‌లో తాండూరు మహిళ సత్తా
● రాష్ట్ర స్థాయి పోటీల్లో మూడు గోల్డ్‌మెడల్స్ సాధించిన సంతోషి
● జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
తాండూరు టౌన్: 12వ తెలంగాణ మాస్టర్ అథ్లెటిక్స్ మీట్‌లో తాండూరు మహిళ సత్తా చాటింది. శని, ఆదివారాల్లో కరీంనగర్‌లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ (30–100 ఏళ్ల వయసు) పోటీల్లో ఏకంగా మూడు గోల్డ్‌మెడల్స్ సాధించింది. పట్టణానికి చెందిన మంకాల్ సంతోషి కుమారి 50ఏళ్ల పైగా వయసు విభాగంలో వంద మీటర్ల పరుగుపందెం, లాంగ్ జంప్, ట్రిపుల్ జంప్‌లలో ప్రథమ స్థానంలో నిలిచింది. జనవరి 30వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ వరకు అజ్మీర్‌లో నిర్వహించనున్న జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్‌కు రాష్ట్రం తరుపున బరిలో దిగనున్నారు. ఈ ఘనత సాధించిన సంతోషి కుమారిని తాండూరు వాసులు అభినందించారు. క్రీడలకు, ఫిట్‌నెస్‌కు వయసుతో సంబంధం లేదని, ఆరోగ్య జీవనానికి నిత్యం వ్యాయామం, క్రీడల్లో పాల్గొనాలని చెప్పారు.
దుద్యాల్: మండల పరిధిలోని హకీంపేట్ రాకమకొండ స్వామి ఆలయంలో ఈ నెల 30 నుంచి జనవరి 4 వరకు ఉత్తర ద్వారా దర్శనం ఉంటుందని ఆలయ ధర్మకర్తలు రాకం అరుణ, యాదయ్య ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆరు రోజుల పాటు ఈ దర్శనాలు ఉంటాయని చెప్పారు.
బీజేపీ జిల్లా కో కన్వీనర్ శ్రీధర్‌రెడ్డి
అనంతగిరి: మున్సిపల్ ఎన్నికల్లో వికారాబాద్ మున్సిపల్ పీఠంపై కాషాయ జెండా ఎగురవేస్తామని బీజేపీ జిల్లా కో కన్వీనర్ శ్రీధర్‌రెడ్డి అన్నారు. ఆదివారం పట్టణంలోని బూరుపల్లి, గంగారం వార్డుల్లో పార్టీ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. పార్టీలో కష్టపడేవారికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు. పార్టీ కార్యక్రమాల విజయవంతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షురాలు యాస్కి శిరీష, సీనియర్ నాయకులు నరోత్తంరెడ్డి, లక్ష్మారెడ్డి, అమర్‌నాథ్, వెంకట్, వినోద్, గోవర్ధన్, మోహన్‌రెడ్డి, బుచ్చిరెడ్డి, మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీజీహెచ్‌ఎంయూ జిల్లా అధ్యక్షుడిగా శంకర్
అనంతగిరి: తెలంగాణ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం(టీజీహెచ్‌ఎంయూ) జిల్లా అధ్యక్షుడిగా జి.శంకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం వికారాబాద్‌లో నిర్వహించిన సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా రూప్‌సింగ్, గౌరవ అధ్యక్షుడిగా సి.రాజు, కోశాధికారిగా కోటిరెడ్డి, ఉపాధ్యక్షులుగా కరుణాకర్, విజయ్‌కుమార్, బుద్దదేవ్, కార్యదర్శులుగా వెంకటయ్య, పూర్ణచందర్, రాష్ట్ర మహిళా కార్యదర్శిగా వసంతలక్ష్మి, ఇతర కార్యవకర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ నజీమొద్దీన్, కార్యదర్శులు మహేంద్ర బహద్దూర్, రవీందర్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.
తాండూరు: కాగ్నా నది కాలుష్యంపై సిటిజన్స్ వెల్ఫేర్ సొసైటీ ప్రతినిధులు చైన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్‌జీటీ)ని ఆశ్రయించారు. ఇందుకు స్పందించిన ఎన్‌జీటీ సంబంధిత అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ 13 అంశాలతో కూడిన ఆర్డర్‌ను వెలువరించింది. కాగ్నా నది ప్రక్షాళన సంబంధిత అధికారులదేనని.. 2026 ఫిబ్రవరి 9వరకు సమస్యను పరిష్కరించాలని సూచించింది. లేదంటే అధికారులు ట్రిబ్య్రునల్ రావాల్సి ఉంటుందని నోటీసు జారీ చేసింది.
మాస్టర్ అథ్లెటిక్స్‌లో తాండూరు మహిళ సత్తా
మాస్టర్ అథ్లెటిక్స్‌లో తాండూరు మహిళ సత్తా


