‘ఉపాధి’ నిర్వీర్యానికి కేంద్రం కుట్ర
పరిగి: ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర పన్నుతోందని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి ఆరోపించారు. వీబీ–జీ రామ్ జీ బిల్లుకు నిరసనగా ఆదివారం పట్టణ కేంద్రంలోని బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఎదుట పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం జాతిపిత పేరును తొలగించడం సరికాదన్నారు. పేదల కోసం కొత్త పథకాలు తీసుకురాకుండా ఉన్న పథకాల పేర్లు మార్చుతూ పబ్బంగడుపుకొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పరశురాంరెడ్డి, కుల్కచర్ల ఏఎంసీ చైర్మన్ ఆంజనేయులు ముదిరాజ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ఆవిర్భావ వేడుకలు
కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం పట్టణ కేంద్రంలో పార్టీ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దేశంలో పార్టీలు ఎన్ని వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఉన్న విలువ వేరు అన్నారు. తరాలు మారిన దేశంలో కాంగ్రెస్ పార్టీ గుర్తింపును చెరపలేరన్నారు.
పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన పీఆర్టీయూ–2026వ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష మినహాయింపుపై అసెంబ్లీలో చర్చిస్తానన్నారు. ప్రతి పేద వాడికి నాణ్యమైన విద్యను అందించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి అమర్‌నాథ్, మండల అధ్యక్షుడు బుగ్గయ్య, ఉస్మాన్‌అలీ, రాకేశ్, రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి


