వైభవంగా ధ్యాన మహాయాగాలు
కడ్తాల్: మండల పరిధిలోని మహేశ్వర మహాపిరమిడ్‌లో పత్రీజీ ధ్యాన మహాయాగాలు ఎనిమిదో రోజు వైభవంగా కొనసాగాయి. వరుసగా సెలవులు రావడంతో పాటు ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి ధ్యానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ధ్యాన గురువు పరిణిత పత్రి మాట్లాడుతూ.. బ్రహ్మర్షీ పత్రీజీ చెప్పిన విధంగా మానవుల్లో ఎనిమిది స్థితులుంటాయని తెలిపారు. పిరమిడ్ మాస్టర్ డాక్టర్ యుగంధర్ ధ్యానం విశిష్టతను వివరించారు. పిరమిడ్ మాస్టర్లు తమ ధ్యాన అనుభవాలను పంచుకున్నారు. అనంతరం పలు ఆధ్యాత్మిక పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు ధ్యానులను విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, సభ్యులు పాల్గొన్నారు.
వైభవంగా ధ్యాన మహాయాగాలు


