ప్రభుత్వం ఇచ్చిన హామీలపై ప్రశ్నించండి
తుర్కయంజాల్: ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ప్రశ్నించాలని ఆదివారం ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు వినతిపత్రం అందించారు. అనంతరం ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జెనిగె విష్ణువర్ధన్, జిల్లా అధ్యక్షుడు కొంతం యాదిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుపై నిర్లక్ష్యం వహిస్తోందని అన్నారు. ప్రభుత్వాన్ని నిలదీసి ఉద్యమకారులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.నరేంద్ర గౌడ్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధ్యక్షుడు నక్క జంగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


